Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:24 PM

అవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చిదిద్దాలి

15-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణాభివృద్ధికి అవిరళ కృషి చేస్తా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట పురపాలక సంఘాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు పునరావృతం కాకుండా నూతన పాలక మండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో నూతనంగా ఎన్నికైన సూర్యాపేట పురపాలక సంఘ ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. 48 వార్డులకు గాను 31 స్థానాల్లో విజయం సాధించిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై పట్టణ ప్రజలు చూపిన ఆదరణ అనన్యసామాన్యమని, ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా సూర్యాపేట పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పట్టణాభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన నిధులు సమకూర్చి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యండి అంజద్ అలి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చిదిద్దాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News