Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:48 AM

అవయవ దానం ఒక అశ్వమేధ యాగం

అవయవ దానం ఒక అశ్వమేధ యాగం

అవయవ దానం ఒక అశ్వమేధ యాగం
06-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అవయవ దానానికి అంగీకారం తెలిపిన డిఎస్వి శర్మ – సమాజానికి స్ఫూర్తిదాయకం

స్పందన శరీర, అవయవ దాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పట్టణానికి చెందిన విశ్రాంత జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి డిఎస్వి శర్మ తమ అవయవ దాన అంగీకార పత్రాన్ని సంస్థ ప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా స్పందన స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షుడు గుండా రమేష్ మాట్లాడుతూ డిఎస్వి శర్మ విశాల దృక్పథంతో, మానవీయ కోణంలో పవిత్ర ఆశయంతో అవయవ దాతగా ముందుకు రావడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అవయవ దానం ఒక అశ్వమేధ యాగంతో సమానమని, ఈ ముందడుగు భావితరాలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.

సంస్థ అధ్యక్షుడు జి రమేష్, కార్యదర్శి మిట్ట కోల కోటయ్య, కోశాధికారి హెచ్ పిచ్చిరెడ్డి, సభ్యుడు రౌతు రమేష్ అంగీకార పత్రాన్ని స్వీకరిస్తూ డిఎస్వి శర్మ సహృదయతను, సత్సంకల్పాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ అవయవ దానం ద్వారా మనిషి మరణానంతరం కూడా ఇతరులలో జీవిస్తూ తన జన్మను సార్థకం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఇది వైద్య విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Sthanikam

అవయవ దానం ఒక అశ్వమేధ యాగం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News