Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

అవలీలగా గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడారు

14-02-2026 856 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిత్తుగా ఓడిపోయిన వెన్ రెడ్డి సంధ్య మూడవ స్థానానికి పడిపోయిన సుర్వి మంజుల

అవలీలగా గెలుస్తామనుకున్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రత్యర్ధుల చేతిలో చిత్తుగా ఓడి పోయారు. శుక్రవారం వెలువడిన మున్నిపల్ ఎన్నికల ఫలితాల్లో చౌటుప్పల్ 16 వవార్డులో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు సతీమణి వెన్ రెడ్డి సంధ్య, 2 వ వార్డు బరిలో నిలిచిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్ సతీమణి సుర్వి మంజుల లు ఘోర పరాజయం పాలయ్యారు. అధికారపార్టీ నుంచి రంగంలోకి దిగిన వారికి ప్రజల ఆశీస్సులు దక్కలేదు.16వ వార్డులో వెన్ రెడ్డి సంధ్య పై ప్రత్యర్థి సిపిఎం అభ్యర్ధి బత్తుల జయమ్మ 374 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందగా, 2వ వార్డులో సుర్వి మంజులపై ప్రత్యర్ధి బిజెపి అభ్యర్థి పోలేపల్లి లక్ష్మి 183 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వలందాసు స్వాతి నిలిచారు.

16 వార్డులో నిశ్శబ్ద విప్లవం...

16 వ వార్డులో ఓటర్ల లో నిశ్శబ్ద విప్లవం చాపకింద నీరులా విస్తరించింది.అది పసిగట్టలేక పోయిన మాజీ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు తన సతీమణి వెన్ రెడ్డి సంధ్య భారీ ఆధిక్యంతో గెలుస్తుందని అంచనా వేశారు. కానీ చివరకు ఫలితం తారుమారైంది. ఒక సామాన్య మహిళ సిపిఎంకు చెందిన అభ్యర్ధి బత్తుల జయమ్మ చేతిలో చిత్తుగా ఓడిపోక తప్పలేదు. ఆమె ఓటమికి కారణం... వెన్ రెడ్డి రాజుపై వార్డు ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తే కారణమని తెలుస్తోంది. ఈ సంచలన ప్రజా తీర్పు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయ బోయే ప్రతి అభ్యర్థికి గుణపాఠంగా నిలుస్తుందన్న చర్చ పుర ప్రజల్లో సర్వత్రా విపిపిస్తోంది.

Sthanikam

అవలీలగా గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడారు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News