Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

16-01-2026 396 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడంలేదన్న కారణంతో అల్లుడు ఆగ్రహానికి లోనై అత్తగారింటి వద్ద బీభత్సానికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కుటుంబ వివాదం తీవ్ర స్థాయికి చేరి, అల్లుడు అత్తగారింటికి నిప్పంటించడంతో పాటు బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన పుట్టింట్లో ఉంటుండగా, పలుమార్లు కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో అల్లుడు తీవ్ర కోపానికి గురయ్యాడు.ఈ కోపంతో నిజాంపేటలోని అత్తగారింటికి వచ్చిన అతడు, వాగ్వాదానికి దిగిన అనంతరం ఆగ్రహంతో ఇంటి ముందు ఆస్తికి నిప్పంటించినట్లు సమాచారం.ఈ ఘటనలో అత్తగారింటి ముందు ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. అలాగే బామ్మర్దికి చెందిన ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

Sthanikam

అత్తగారింటి ముందు బీభత్సం – ద్విచక్ర వాహనం దగ్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News