Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

08-01-2026 323 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రెడ్డిగూడెం స్ధానికం ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో ఈనెల నాలుగోతేది అర్థరాత్రి హత్యకు గురైన సంగెపు శ్రావణి కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరస్తున్నట్లు సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం నాడు మైలవరం సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం హతురాలు సంగెపు శ్రావణి కి తన అత్త సంగెపు పద్మావతి (59)కీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్త పద్మావతి మరొక నిందితురాలు పొగర్త కోటమ్మ(38)తో కలిసి శ్రావణిని అంతం చేయడానికి ముందుగా అనుకున్న ప్రకారం నాలుగో తేది రాత్రి పద్మావతి, కోటమ్మ కలిసి ఇంట్లో ఉన్న రాడ్ బెండింగ్ కి ఉపయోగించే ఇనుప పైప్ తో కొట్టి ,గొంతు నులిమి హత్య చేశారు. హతురాలు తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు 6 బృందాలుగా బయలుదేరి విచారణ చేస్తుండగా నిందితులు రెడ్డిగూడెం నుండి రుద్రవరం వెళ్లే దారిలో నరుకుళ్ళపాడు అడ్ఢరోడ్డువద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన రాడ్ బెండింగ్ ఇనుప పైప్ ను రాఘవాపురం కోతుల వాగులో మధ్య వర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకొని నిందితులను మైలవరం మేజిస్ట్రేట్ వారి ముందు హజరుపరుస్తామని సి ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేసు విషయమై తదుపరి ధర్యాప్తు కొనసాగుతుందని సిఐ తెలియజేసారు. ఈ సమావేశంలో రెడ్డిగూడెం ఎస్ ఐ ఎస్ శ్రీను, రెడ్డిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

అత్తే హంతకురాలు కుటుంబ కలహాలే హత్యకు కారణం వేగంగా కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News