Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:47 AM

అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్ 71 మోటార్లు, రెండు వాహనాలు స్వాధీనం – 7 మంది నిందితులు పట్టివేత

అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్ 71 మోటార్లు, రెండు వాహనాలు స్వాధీనం – 7 మంది నిందితులు పట్టివేత

అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్ 71 మోటార్లు, రెండు వాహనాలు స్వాధీనం – 7 మంది నిందితులు పట్టివేత
March 12, 2026 10:13 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వరంగల్: వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ సిసిఎస్ పోలీసులు కమలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6.60 లక్షల విలువ గల 71 కరెంట్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీ, ఒక కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్ (26), మంచిర్యాల ప్రాంతానికి చెందిన మోతే రాజు (25), టేకు నవీన్, మోటం తిరుపతి, వారణాసి లక్ష్మణ్ (26), మోటం నరేష్ (25), వస్తం భీమేష్ (28)లను అరెస్ట్ చేశారు.

నిందితులు మద్యం సేవనానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలించి అమ్ముకుంటూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

దర్యాప్తులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్, దామెర పోలీస్ స్టేషన్ల పరిధిలో 34 మోటార్లు, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కేశవపట్నం, సైదాపూర్, ఇల్లంతకుంట ప్రాంతాల్లో 36 మోటార్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ దొంగిలించినట్లు తేలింది.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీలు పీ. సదయ్య, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. వంగపెళ్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో ఆటో ట్రాలీ, కారులో వస్తున్న నిందితులను పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. వారి సమాచారంతో పరకాల ప్రాంతంలోని ఒక ఇంటిలో దాచిపెట్టిన మరికొన్ని మోటార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఎ. రాఘవేందర్, కె. రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటీ కోర్ టీమ్ ఏఏఓ మొహమ్మద్ సల్మాన్ పాషా, ఎస్‌ఐ శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ హమ్మెద్, కె. మహేశ్వర్, వి. జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్, ఎస్‌ఐ దిలీప్ తదితర సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News