Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.
03-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శినారి ఐలయ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ కార్మికులందరికీ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి నేటికీ అమలుకు నోచుకోలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య విమర్శించారు. శనివారం నాడు చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కోటి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆత్మీయ భరోసా కింద ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ఇవ్వకపోవడం వ్యవసాయ కార్మికుల మీద నిర్లక్ష్య చేస్తూ పేద మధ్యతరగతి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి ధోరణి సరికాదని తెలిపారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కార్మికుల చేతులు బొగ్గలు వచ్చినప్పటికీ పనికి తగ్గ వేతనం రావట్లేదని కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని రోజుకు 800 రూపాయల కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిముట్లు గడ్డపార, టెంకే, మంచినీళ్లు, టెంటు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తక్షణమే అందించాలని,50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు 3000 పెన్షన్ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని, రెండు పూటలా ఫోటో విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి సంఘం నాయకులు కాసర్ల ముత్తయ్య, అంతటి రాధ, కొంతం మనమ్మ, కంకల సరిత,మస్కు యాదమ్మ, అచ్చిన ఐలమ్మ, గోపగోని హేమలత, మారగోని విజయ, కొయ్యగూర శారద, కుంభం సుజాత, రెడపాక అమృత, కంకల సరిత, రాచకొండ లక్ష్మమ్మ, కుక్కల నిర్మల తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నూతన కమిటీ అధ్యక్షులుగా అంతటి రాధ, ఉపాధ్యక్షులుగా కొంతం మనమ్మ, కార్యదర్శిగా జవ్వాజి అలివేలు, సహాయ కార్యదర్శిగా మారగొని విజయ, కోశాధికారిగా కాసర్ల ముత్తయ్య తోపాటు 11 మంది కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Sthanikam

ఆత్మీయ భరోసా" ను వెంటనే అమలు చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News