Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

అశ్విని,అప్షాబేగం లకు విశిష్ట ప్రశంసా సర్టిఫికెట్లు అందజేత

24-01-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ ముఖ్య కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కేతావత్ లలిత కుమారి చేతుల మీదుగా బోరంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులుగా అశ్విని (విద్యా ప్రమాణాలు) మరియు అప్షాబేగం (క్రీడలు)లకి ప్రశంసా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ సర్పంచ్ నరసింహ రావు పాటిల్, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి యాదగిరి, మండల విద్యాధికారి నగరం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయులు మహేష్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనవంతంగా విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా బాలికల సాధికారత, విద్యా, క్రీడా ప్రగతి మరియు సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల అంకితభావం ప్రతిబింబించింది.

Sthanikam

అశ్విని,అప్షాబేగం లకు విశిష్ట ప్రశంసా సర్టిఫికెట్లు అందజేత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News