Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.

30-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లోని సాలగ్రామ నారాయణుడికి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గండభేరుండ నరసింహస్వామి అవతారంలో భక్తులను అనుగ్రహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ విష్ణుమూర్తి యొక్క అత్యంత ఉగ్రమైన, అరుదైన రూపం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుని కోపాన్ని తగ్గించడానికి, శరభుడిని ఓడించడానికి విష్ణువు ఈ రెండు తలల పక్షి, గండభేరుండ రూపాన్ని ధరించారు. దీనిని అష్టముఖ గండభేరుండ నరసింహ స్వామి అని కూడా పిలుస్తారు. గండభేరుండ నరసింహస్వామి హయగ్రీవ, వ్యాఘ్ర, సింహ, గండభేరుండ (రెండు తలల పక్షి), భల్లుక, ఎలుగుబంటి, గరుడ, ఆంజనేయ, వరాహ,

ఎనిమిది ముఖాలు, 32 చేతులతో ఉంటారు. ఈ స్వామిని ఆరాధించడం వల్ల శత్రు సంహారం, రోగ నివారణ, దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుందని, ఇది అపారమైన మాయా శక్తి కలిగిన రూపంగా పురాణాల్లో తెలుపబడింది అని అన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అలంకరణలో సాలగ్రామ నారాయణుడి దర్శనం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News