Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

“ఆశాలకు రూ.18 వేల ఫిక్స్ వేతనం ఇప్పుడే ఇవ్వాలి” – భారీ ర్యాలీ, మంత్రి కార్యాలయం ముట్టడి, అరెస్టులపై ఆగ్రహం

“ఆశాలకు రూ.18 వేల ఫిక్స్ వేతనం ఇప్పుడే ఇవ్వాలి” – భారీ ర్యాలీ, మంత్రి కార్యాలయం ముట్టడి, అరెస్టులపై ఆగ్రహం

“ఆశాలకు రూ.18 వేల ఫిక్స్ వేతనం ఇప్పుడే ఇవ్వాలి” – భారీ ర్యాలీ, మంత్రి కార్యాలయం ముట్టడి, అరెస్టులపై ఆగ్రహం
March 20, 2026 04:53 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

రాష్ట్రంలో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆశా వర్కర్ల సమస్యలు మరోసారి ఉధృతమయ్యాయి. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీస్తూ, పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. Centre of Indian Trade Unions (సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీకి అనుగుణంగా ప్రస్తుత బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం Telangana ASHA Workers Union రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దొడ్డి కొమరయ్య భవన్ నుంచి పెదగడియారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరా భవన్ వద్ద ముట్టడి చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆర్డీవో అశోక్ రెడ్డిని పిలిపించి, ఆశా వర్కర్ల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. సలీం తన ప్రసంగంలో మాట్లాడుతూ, గత మూడు నెలలుగా ఆశా వర్కర్లకు పారితోషకాలు అందడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలను చెల్లించాలని, పారితోషకాల విధానాన్ని రద్దు చేసి ఫిక్స్డ్ వేతన విధానం అమలు చేయాలని కోరారు. ఆశా వర్కర్లపై అనవసర టార్గెట్లు పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఈ ఒత్తిడితో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.

ఆరోగ్య శాఖకు సంబంధం లేని పనులు ఆశా వర్కర్లపై మోపడం అన్యాయమని, వారిని కేవలం ఆరోగ్య సేవలకు మాత్రమే పరిమితం చేయాలని అన్నారు. అలాగే ఎన్‌హెచ్‌ఎమ్ (NHM) పథకానికి తగిన నిధులు కేటాయించి ఆశా వర్కర్ల సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రుల కార్యాలయాల ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులను సిఐటియు నేతలు తీవ్రంగా ఖండించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, తెల్లవారుజామున మహిళలని కూడా పట్టించుకోకుండా అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని విమర్శించారు.

జిల్లాలో సుమారు 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో 400 మందికి పైగా కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేశ్వరి, కార్యదర్శి తవిటి వెంకటమ్మ, సిఐటియు నాయకులు దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, పెంజర్ల సైదులు, ఏదుల సునీత, ఆదిమల్ల సుధీర్, సిహెచ్ అనురాధతో పాటు సైదమ్మ, రేణుక, నవనీత, కవిత, శైలు తదితరులు పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఆశా వర్కర్ల సమస్యలు మరోసారి ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను పరిష్కరిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News