అసెంబ్లీలో గళమెత్తిన ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
అసెంబ్లీలో గళమెత్తిన ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
Sthanikam District Staff Reporter
నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజా సంక్షేమ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజా సంక్షేమ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూనే,ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఎనిమిదోవ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అన్ని రోజులతో కలిపి సుమారుగా 40నిమిషాలు అన్ని అంశాలపై మాట్లాడారు."నియోజకవర్గ అభివృద్ధి-సాగునీటి ప్రాజెక్టులు:15వ కెనాల్ మరియు సాగునీరు:ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.15వ కెనాల్‌కు అదనపు ఓటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలేరులోని మరికొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని కోరారు."ప్రాజెక్టుల పురోగతి:గంధమల్ల ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రస్తావిస్తూ, పనులను వేగవంతం చేయాలన్నారు."నష్టపరిహారం:బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన లప్ప నాయక్,చోక్లా తండా బాధితులకు,అలాగే భువనగిరి-రాయగిరి ప్రాంతాల్లో త్రిబుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్)భూ బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
"వైద్యం మరియు ఆరోగ్యం:ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. తెలుగు సీలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది అన్నారు.''ఆసుపత్రి ఆధునీకరణ: ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని మరియు డయాలసిస్ సెంటర్‌లో బెడ్ల సంఖ్యను పెంచి రోగులకు భరోసా కల్పించాలని కోరారు."నిషేధిత భూములు- గృహ నిర్మాణం:నిషేధిత జాబితా:ఇళ్లు, ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగించి,సామాన్యుల క్రయవిక్రయాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు."ఇందిరమ్మ ఇళ్లు:- తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తడం జరిగిందని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు."ఉద్యోగ,కార్మిక మరియు సామాజిక "అంశాలు:గిగ్ వర్కర్లు మరియు అంగన్వాడీలు: గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచి,వారి సమస్యలను తీర్చాలని విన్నవించారు. ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) పేరు మార్చవద్దని,పాత చట్టాన్నే కొనసాగించాలని స్పష్టం చేశారు."నిరుద్యోగం:రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుందని గుర్తు చేశారు.ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం:ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ఎ మ్మెల్యేలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదారి పట్టిస్తూ అరాచకానికి పాల్పడుతున్న సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతిని కోరారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్నరోడ్లను వెంటనే బాగు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి