Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:57 AM

అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో

అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో

అసెంబ్లీ ముట్టడి ముందే చర్యలు… గిరిజన నేతలు అదుపులో
March 25, 2026 11:04 AM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గిరిజనులు కోరిన ప్రదేశంలోనే సేవాలాల్ పుణ్యక్షేత్రం మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణ పోలీసులు ముందస్తు చర్యగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, పూల్ సింగ్ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టులపై సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ఇలా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడమేనని విమర్శించారు. శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్న నాయకులను అడ్డుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. గిరిజనుల ఆకాంక్షలను గౌరవించి వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News