Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:30 PM

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

29-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కారణంగా విద్యార్థులకు అనారోగ్యం ఏర్పడిన విషయం తెలుసుకున్న వెంటనే,వారిని నారాయణఖేడ్ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని, అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు దీనికి గల కారణాలను పూర్తిగా విచారించి,బాధ్యత వహించాల్సిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యా అధికారులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఎమ్మెల్యే తమ పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగదని, ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.పిల్లలు త్వరగా కోలుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తూ తల్లిదండ్రులను ధైర్యపరిచారు.ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు,విద్యా అధికారులు, వైద్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News