Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు

29-12-2025 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు

సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మండలం :

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా కార్యకర్తల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి, ఆ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు.

ఇచ్చిన మాట ప్రకారం సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఆశా కార్యకర్తల జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా వారు ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

గత రెండేళ్లుగా ఆశా వర్కర్ల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో అక్రమ అరెస్టులకు పాల్పడటం అన్యాయమని అన్నారు.

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు తమకు కొత్త కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చిన మేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

Sthanikam

అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News