Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

ఆరోగ్యానికి యోగా.. ఉల్లాసానికి 'సండే - హ్యాపీ డే'

27-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

​* మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

​శారీరక ధృడత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక పైలాన్ పార్క్‌లో 'సండే హ్యాపీ డే' వేడుకను ఘనంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు, వాకర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ,"సమాజం కోసం తెల్లవారుజామునే నిద్రలేచి శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. నిత్యం కష్టపడే వారు తమ అలసటను మర్చిపోయి, ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది."

రీల్స్ వద్దు.. వ్యాయామమే ముద్దు:

నేటి కాలంలో సెల్ ఫోన్లలో అధికంగా 'రీల్స్' చూడటం వల్ల శారీరక జడత్వంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి, క్రీడలు, వ్యాయామం వైపు మొగ్గు చూపాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా కృషి చేసి చౌటుప్పల్‌ను 'స్వచ్ఛ, ఆరోగ్యకరమైన నగరంగా' తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు, స్థానికులు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. యోగాసనాలు వేస్తూ, వ్యాయామాలు చేస్తూ పార్కులో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్, 2వ వార్డు కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మి, నాయకులు చింతల సాయిలు, పోలేపల్లి ముత్తయ్య, మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ కె. హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ ఎం. రేణు కుమార్, జవాన్లు అంజయ్య, నరసింహ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యానికి యోగా.. ఉల్లాసానికి 'సండే - హ్యాపీ డే'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News