Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ

18-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వేములపల్లి జడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం యోగా కార్యక్రమం, 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేములపల్లి సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్, శెట్టిపాలెం సర్పంచ్ పెద్దపంగా సైదులు మాట్లాడుతూ యోగా ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.

2కే రన్ ద్వారా యువతలో ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించడం కార్యక్రమం లక్ష్యమన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలికాంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎస్‌కే హాజీ, మాతంగి సుధీర్, వలపట్ల మాధవి రమేష్, బొంగర్ల సుకన్య వినోద్, ఏబీఆర్ యూత్ అధ్యక్షుడు పుట్టల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం. వేములపల్లిలో యోగా, 2కే రన్ నిర్వహణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News