కిరాణా షాపులో నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దుండగులు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు చింతల చెరువు ప్రాంతంలో ఉన్న శ్రీ రామాంజనేయ కిరాణా షాపులో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.
షాపు యజమాని రెగట్టి రాజేష్ గురువారం రాత్రి సుమారు 8.30 గంటలకు దుకాణం మూసి వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు గేటు పైనుంచి లోపలికి ప్రవేశించి,తలుపు గడియ విరగ్గొట్టి షాపులోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లిన దొంగలు కౌంటర్‌లో ఉన్న నగదుతో పాటు,వెనుక గదిలోని సూట్‌కేసులో భద్రపరిచిన 12 గ్రాముల బంగారం,30 తులాల వెండి కడియాలు,మరియు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.ఈరోజు ఉదయం సుమారు 6 గంటలకు షాపు తెరిచి చూడటంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి