Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:00 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు

24-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ఆదేశాల మేరకు ఈ మద్దతు తెలిపినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు భోర్గి భీమన్న, నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు అనుముల తుకారం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయసమ్మతమని, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. కార్మికులకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి కీలక అంశాలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించకపోతే, బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాశయ్య, రాజు, దినేష్, శరణప్ప, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News