Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

27-03-2026 269 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ కు సమాన దూరంలోనే నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఓ ఆర్ ఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ను 60 కిలోమీటర్ల దూరంలో చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఒకచోట 28 కిలోమీటర్లు, మరోచోట 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డును తీసుకెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాన దూరంలో రోడ్డును నిర్మిస్తే అభివృద్ధి సమానంగా జరుగుతుందని తెలిపారు.రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్ఆర్‌ఆర్ రోడ్డును సమాన దూరంలో చేపట్టాలి -ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

Article Image

రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ కు సమాన దూరంలోనే నిర్మించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం డిమాండ్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఓ ఆర్ ఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ను 60 కిలోమీటర్ల దూరంలో చేపడితే ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఒకచోట 28 కిలోమీటర్లు, మరోచోట 50 కిలోమీటర్ల దూరంలో రోడ్డును తీసుకెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమాన దూరంలో రోడ్డును నిర్మిస్తే అభివృద్ధి సమానంగా జరుగుతుందని తెలిపారు.రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, తీర్పారీ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, బత్తుల సుధాకర్, టంగుటూరి రాములు, రోషగారి అంజయ్య, దాసరి అంజయ్య, కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News