Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

అర్హులందరికీ సంక్షేమం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు – మంత్రి

అర్హులందరికీ సంక్షేమం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు – మంత్రి

అర్హులందరికీ సంక్షేమం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు – మంత్రి
April 02, 2026 04:53 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆందోల్ మండలం అల్మాయిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామసభ తెలంగాణ గీతంతో ప్రారంభమై ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించగా, అధికారులు గ్రామంలో అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.3.50 కోట్ల రుణాలు, రూ.2.50 లక్షల వడ్డీ సబ్సిడీ అందించామని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు భీమా, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.అల్మాయిపేటలో కొత్త కాలనీ ఏర్పాటు చేస్తే రహదారులు, నీటి ట్యాంకులు, విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే హైవే నుండి అల్మాయిపేట–కొన్యాల వరకు బీటీ రహదారి, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులను మంజూరు చేస్తామని తెలిపారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచిస్తూ, అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు.ఆందోల్ ప్రాంతంలో విద్యా, పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు సంగుపేట గుట్ట వద్ద పరిశ్రమలు స్థాపించనున్నట్లు వెల్లడించారు.పేదలకు చెందిన అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి వాటిని అసలు లబ్ధిదారులకు తిరిగి అందజేస్తామని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని, మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త సంక్షేమ పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మంత్రి, కలెక్టర్ కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News