Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి.సీపీఎం.

07-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రామన్నపేట పట్టణ కమిటీ సమావేశం శనివారం రాత్రి గాదె నరేందర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామసభల్లో సుమారు 400 మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పద్మశాలి కాలనీలో నూతన మంచినీటి ట్యాంకు నిర్మించాలని, సాకరికుంట నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వరద కాలువ ఏర్పాటు చేయాలని కోరారు. 14వ వార్డులో కోర్టు కాలనీ నుంచి పెద్దమోరీ వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సూచించారు.

నేతాజీ క్లబ్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడి అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా వాటర్ ప్లాంట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు భావడ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, గొరిగే సోములు, సీఐటీయూ నాయకులు పల్లె సత్యం, ఆముదాల ఆంజనేయులు, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, కుందూరు వెంకటేశ్, రాసాల రమేష్, అప్పం సంతోష్, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి.సీపీఎం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News