Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

07-02-2026 166 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామాన్ని శనివారం ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ స్థితిని ఆమె సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వం ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్ కీలకమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మానూర్ మండల తహశీల్దార్ విష్ణు సారగ్, బిఎల్ఓ సూపర్వైజర్ రాంచందర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్‌, గ్రామ బిఎల్ఓ సునీత, విజయలక్ష్మి, సుందరమ్మ , పాటు ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికల ఏర్పాట్లను విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.

Sthanikam

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామాన్ని శనివారం ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ స్థితిని ఆమె సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వం ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల మ్యాపింగ్ కీలకమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మానూర్ మండల తహశీల్దార్ విష్ణు సారగ్, బిఎల్ఓ సూపర్వైజర్ రాంచందర్,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మైనోద్దీన్‌, గ్రామ బిఎల్ఓ సునీత, విజయలక్ష్మి, సుందరమ్మ , పాటు ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికల ఏర్పాట్లను విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News