Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

28-03-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణం ఈ వేసవిలో విద్యుత్ అంతరాయాలతో అల్లాడుతోంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి వేళల్లో అరగంటకోసారి కరెంటు రావడం–పోవడం జరుగుతుండటంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత వేడి మధ్య విద్యుత్ లేక ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్కసారి కరెంటు వస్తే మరికొద్దిసేపటికే మళ్లీ వెళ్లిపోవడం రోజువారీగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్లు, కూలర్లు పనిచేయక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వ్యాపారవేత్తలు కూడా నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు.ఇక విద్యుత్ శాఖ అధికారులు మాత్రం “బ్రేక్‌డౌన్ సమస్య తలెత్తింది. మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది” అని చెబుతున్నారు. అయితే సమస్య ఎప్పటికప్పుడు పునరావృతం కావడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.

వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో విద్యుత్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. నిరంతర సరఫరా కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Sthanikam

అరగంటకోసారి కరెంటు కోతలు… చిట్యాల పట్టణం ఉక్కిరిబిక్కిరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News