Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:13 AM

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

05-01-2026 239 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సిరిపురం నుంచి పెద్ద కాపర్తి వెళ్లే మార్గంలో కొనసాగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ పనులు రైతులకు తీవ్ర తలనొప్పిగా మారాయని బీసీ సెల్ మండల అధ్యక్షుడు కూనూరు ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వపై నిర్మిస్తున్న వంతెన అర్ధాంతరంగా ఉండటంతో అది ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.కాల్వ మీద నిర్మించిన కల్వర్టును సుమారు మీటర్ లోతులో ఏర్పాటు చేయడం వల్ల లోడ్ ట్రాక్టర్లు, వరి ధాన్యాలు తరలించే వాహనాలు రోడ్డు ఎక్కలేని దుస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే కల్వర్టులో నీరు నిల్వ ఉండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.ఐపీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో స్పష్టమైన ప్రణాళిక లేకుండానే పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారని ముత్తయ్య వెల్లడించారు. దీని వల్ల గ్రామీణ రహదారిపై వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు.ఈ పరిస్థితికి వెంటనే పరిష్కారం చూపాలని, పెద్ద కాపర్తి–సిరిపురం రోడ్డుపై రెండు లైన్ల కల్వర్టును నిర్మించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

అర్ధాంతర వంతెనతో వ్యవసాయ రాకపోకలకు అంతరాయం – కూనూరు ముత్తయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News