Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది

11-03-2026 340 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఘర్షన చికిత్స పొందుతూ శంభులింగం మృతి

నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో అప్పు వసూళ్ల విషయంలో చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు శంభులింగం (60)పై అదే గ్రామానికి చెందిన సుర ఆంజనేయులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అప్పు లావాదేవీల విషయమై ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణగా మారడంతో ఆంజనేయులు శంభులింగంపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో శంభులింగానికి ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.గాయపడిన శంభులింగాన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, గతంలో పెద్దమనుషుల సమక్షంలో రూ.80 వేల అప్పు చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు రావాల్సి ఉందని చెప్పి ఇంటికి పిలిచి సుర ఆంజనేయులు దాడి చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గ్రామంలో అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కేసుల్లో కూడా సుర ఆంజనేయులుపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

అప్పు వసూళ్ల తగాదా వృద్ధుడి ప్రాణం తీసింది

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News