Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

06-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకు వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడిని నార్కట్‌పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నలగొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన రెబ్బ జానకమ్మ (72) వద్ద అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ (24) రూ. 1.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయడంతో, 2024 ఆగస్టు 2న ఆమెను గొంతు నులిమి హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు. అనంతరం విజయవాడలో తలదాచుకున్న నిందితుడు, మంగళవారం తిరిగి గ్రామానికి వస్తుండగా పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడి నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబు, సాయి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

​అప్పు తీర్చమన్నందుకు వృద్ధురాలి హత్య: నిందితుడి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News