Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:12 AM

ఆపన్న హస్తానికే మా ఓటు అంటున్న వెల్లంకి గ్రామం

13-12-2025 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

వెల్లంకిలో ఆయన అంటేనే ఒక ఆపన్న హస్తం అని పేరు, పేదోళ్లకు పెద్దన్న.. ఆయనే ప్రముఖ చేనేత పారిశ్రామిక వేత్త ,అఖిల భారత పద్మశాలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఇడెం రాధా శ్రీనివాస్... సామాజిక సేవలో ముందు వరసలో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యకిగా ఆయనకు పేద, మధ్యతరగతి ప్రజల కష్టసుఖాలు అన్ని తెలుసు. ఆయనకు గ్రామం అన్నా.. గ్రామంలోని ప్రజలన్నా.. ఎంతో ప్రీతి తాను సంపాధించిన దాంట్లో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఎప్పటికప్పుడు ఆలోచించే వ్యక్తి ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య రాధను బిజెపి బలపరిచిన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దించారు. వెల్లంకి అభివృద్ధి ప్రదాత తాజా మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి సహకారంతో పాటు ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండటంతో ఆయన గెలుపు లాంఛన ప్రాయంగానే మారిందని అంతా అనుకుంటున్నారు.

ఇడెం స్వరూపా సేవా సంస్థ ద్వారా ఇప్పటికే ఆయన పలు సేవా, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రజలకు వాటర్‌ డ్రింకింగ్‌ క్యాన్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, హై స్కూల్ విద్యార్థులకు టై,బెల్టు ఇతర మెటీరియల్‌ పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గ్రామంలో స్వాగత తోరణాలు(ఆర్చ్)నిర్మించారు. గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలకే కాకుండా జిల్లాలో ఉన్న కొన్ని దేవాలయాలకు దీపం నూనె అందిస్తూ వస్తున్నారు. ఏటా గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా పండగకు బట్టలు పెడతూ వస్తున్నారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పెళ్లిలు పేరంటాలకు తన వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈయన సేవలను గుర్తించి వల్లూరి ఫౌండేషన్‌ వారు జాతీయ బంగారు నంది అవార్డును ప్రధానం చేశారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి చేతుల మీదుగా ఈయన ఓ నేతన్న కథ అనే సీడీని కూడా ఆవిష్కరింప చేశారు. చేనేత సమస్యలపైన ఛలో డిల్లీ వంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తర అమెరికాలో జరిగిన ప్రపంచ పద్మశాలీ సదస్సుకు గౌరవ అతిథిగా ఈయనకు స్వాగత కూడా లభించింది. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం సేవా గుణం కలిగిన ఇడెం శ్రీనుకే తమ మద్దతు అంటు వెల్లంకి గ్రామ ప్రజలు ముక్త కంఠంతో అంటున్నట్లుగా తెలుస్తోంది. ఏ పదవి లేకుండానే ప్రజల బాగోగులు ఆలోచిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న ఇడెం శ్రీను ఇక సర్పంచిగా అవకాశం ఇస్తే అన్ని విధాల అండగా ఉంటాడని గ్రామ ప్రజల అభిప్రాయం.

Sthanikam

ఆపన్న హస్తానికే మా ఓటు అంటున్న వెల్లంకి గ్రామం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News