Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

అనుమతులు లేకుండా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం:హద్నూర్ పోలీస్ అధికారులు

16-01-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:ప్రభుత్వ పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నేడు ఉదయం సుమారు పది గంటల సమయంలో, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ బియ్యాన్ని విక్రయించేందుకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ మరియు సిబ్బంది కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో చల్కి చౌరస్తా వద్ద ఒక ఆటోను ఆపి సోదాలు నిర్వహించగా, అందులో సుమారు ఐదు క్వింటాళ్ల ప్రభుత్వ పంపిణీ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు బయటపడింది. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని విచారించగా, అతడు నారాయణఖేడ్ మండలం పిప్రి గ్రామానికి చెందిన జాదవ్ పరశురాం, తండ్రి లక్ష్మణ్, వయస్సు నలభై సంవత్సరాలు, లంబాడా కులానికి చెందినవాడని గుర్తించారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు అతడు అంగీకరించాడు.ఈ సంఘటనపై అధికారులు వెంటనే పంచనామ నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తిపై చట్టబద్ధంగా కేసు నమోదు చేసి, తదుపరి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.ప్రభుత్వ పేదల ఆహార భద్రత కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా తరలించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపశమనం ఉండదని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో కూడా తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న వారి సమాచారం అధికారులకు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

అనుమతులు లేకుండా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం స్వాధీనం:హద్నూర్ పోలీస్ అధికారులు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News