Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:42 AM

అనంతపురం లో 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం లో 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం లో 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
February 22, 2026 07:21 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

1100 కాల్ సెంటర్ వినియోగించుకోండి.

అనంతపురం, జిల్లా ప్రజలు “మీ కోసం” కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రజలు దాఖలు చేసిన అర్జీలు ఇంకా పరిష్కారం కాలేదా? లేదా తమ ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవాలా? అయితే 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

అలాగే కొత్తగా అర్జీలు నమోదు చేసుకోవాలనుకునే వారు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సేవలను వినియోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని ప్రజలను కోరారు.

23న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

ఈనెల 23వ తేదీ సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు.

అర్జీదారులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన రసీదు లేదా స్లిప్పును తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ సందేశం వస్తుందని, ఫోన్‌ను పరిశీలించాలని తెలిపారు.

నోటీసులు, ఎండార్స్‌మెంట్‌లను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నామని, అవసరమైతే రిజిస్టర్డ్ పోస్టు ద్వారా చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీలు స్పష్టంగా, పూర్తి వివరాలతో నింపాలని, రిపీట్ అర్జీలు ఇస్తున్న వారు పాత రసీదును తప్పనిసరిగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News