Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:41 AM

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి

18-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి

ప్రజల భద్రతకే పోలీసుల సైబర్ అవగాహన చర్యలు: ఎస్పీ పారితోష్ పంకజ్

సంగారెడ్డి, జిల్లా స్థానికం ప్రతినిధి

సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించేందుకు పోలీసు శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఈ క్రమంలో బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. ఏ పోలీసు అధికారి కూడా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరని, అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనే వ్యవస్థే లేదని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

అదేవిధంగా నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పుతూ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

సైబర్ నేరస్తులు పన్నే మోసపూరిత ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు

Sthanikam

అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News