Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:27 AM

ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఆందోళన అఖిల భారత మెడికల్ షాప్ బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ సంపూర్ణ మద్దతు

20-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలు పెరుగుతుండటం, భారీ తగ్గింపు ధరలతో ఔషధాల అమ్మకాలు జరగడం వల్ల చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD) పిలుపునిచ్చిన అల్ ఇండియా మెడికల్ షాపుల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

ఈ సందర్భంగా టీఎంఎస్‌ఆర్‌యూ నాయకులు మాట్లాడుతూ, ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలు సంప్రదాయ మెడికల్ షాపుల ఉనికికే ముప్పుగా మారాయని పేర్కొన్నారు. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించడం వల్ల స్థానిక మెడికల్ షాపులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో అనేక దుకాణాలు ఆర్థికంగా నష్టపోయి మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో విక్రయించే మందుల నాణ్యత, భద్రతపై కూడా అనేక సందేహాలు ఉన్నాయని నాయకులు తెలిపారు. వైద్యుల సలహా లేకుండా మందులు సులభంగా అందుబాటులోకి రావడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందుల వినియోగం పెరిగితే దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే చిన్న మెడికల్ షాపులను రక్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని, భారీ డిస్కౌంట్‌ల పేరుతో జరుగుతున్న అన్యాయ పోటీని అరికట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ ఉద్యమం మెడికల్ షాపుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, నిరంజన్, పోలా రమేష్ పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి స్వామి, అధ్యక్షుడు హరిప్రసాద్, కోశాధికారి జీవన్, ఉప కార్యదర్శి నరేంద్ర, ఉపాధ్యక్షుడు అనిల్, కమిటీ సభ్యులు శ్రీహరి తదితరులు హాజరై బంద్‌కు సంఘీభావం తెలిపారు. నాయకులు మాట్లాడుతూ మెడికల్ షాపుల పరిరక్షణ కోసం అవసరమైతే మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఆందోళన అఖిల భారత మెడికల్ షాప్ బంద్‌కు టీఎంఎస్‌ఆర్‌యూ సంపూర్ణ మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News