Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:16 AM

అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం

11-12-2025 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

భూవనగిరి మండలం, అనాజిపురం: గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి రాయపురం సురేష్ (కత్తెర గుర్తు)ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, గ్రామ ఎన్నికల అబ్జర్వర్ పడిగెల ప్రదీప్ పిలుపునిచ్చారు.

వారు గురువారం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్‌లు ఏదునూరి మల్లేశం, గుణగుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేతలు మాట్లాడుతూ—

గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు.

వీటిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం సరఫరా, రైతులకు ఋణమాఫీ, పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఉన్నాయని తెలిపారు.

గ్రామంలో కూడా హెచ్ఎండిఎ నిధులతో సీసీ రోడ్లు, మురికివాడలో చెక్‌డ్యామ్ నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే కాంగ్రెస్–సీపీఎం అభ్యర్థులను విజయం సాధించాలన్నారు.

Sthanikam

అనాజిపురంలో కాంగ్రెస్–సీపీఎం మద్దతుతో ఇంటింటా ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News