Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:34 PM

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా
13-01-2026 2,639 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్టీసీ బస్సులోకి దూసుకువచ్చిన ప్లెక్సీలు.. విద్యార్థిని మృతి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మానూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజా అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పూజా ర్యాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువు పూర్తి చేసి, ప్రస్తుతం బాసరలోని ట్రిపుల్ ఐటీలో (IIIT) ఉన్నత చదువులు కొనసాగిస్తోంది.సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నారాయణఖేడ్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలం పరిధిలోని వైకుంఠపురం గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ప్లెక్సీలు తరలిస్తున్న ఒక ఆటో ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్లెక్సీల సీకు ఆర్టీసీ బస్సులోకి దూసుకువచ్చింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన పూజా అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో తిమ్మాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగకు ఇంటికి వస్తూ మృతి చెందడం గ్రామస్తులను కన్నీటిపర్యంతం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.పూజా మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యలో ప్రతిభావంతురాలిగా పేరొందిన పూజా అకాల మరణం తీరని లోటుగా మారింది.

Sthanikam

అమ్మ ఒడికి చేరకముందే అనంత లోకానికి పూజా

Article Image

మీ స్పందన? 8 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News