Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

27-12-2025 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్ల విధ్వంసం – ప్రజల సహనానికి పరీక్ష

సూర్యాపేట, స్థానిక ప్రతినిధి:

సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టి నెలల తరబడి వదిలేయడం ప్రజలకు శాపంగా మారిందని సీపీఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 9వ వార్డులో పగలగొట్టిన రోడ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పైపులు వేసిన కాంట్రాక్టర్లు రోడ్ల పునర్నిర్మాణం చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

రోడ్లు గుంతలుగా మారడంతో వృద్ధులు, పిల్లలు, వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల ఓట్లు తప్ప సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట పగలగొట్టిన రోడ్లను పూడ్చి కొత్త రోడ్లు వేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, కప్పల సత్యం, బుద్ధ సంతోష్, నల్ల మేకల రామ్‌కుమార్, ఉపేందర్ పాల్గొన్నారు

Sthanikam

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట రోడ్లు పగలగొట్టి వదిలేశారు – సీపీఎం ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News