Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

03-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్, జనవరి 3: స్థానికం ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సు బ్రోచర్‌ను వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు.

“సుస్థిర అభివృద్ధి కోసం వ్యాపార పరివర్తన” అంశంపై ఈ జాతీయ సదస్సు మార్చి 13, 14 తేదీల్లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనుంది. పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులు, వక్తలుగా పాల్గొననున్నారు.

సదస్సులో సుస్థిరత కోసం డిజిటల్ పరివర్తన, ఫిన్‌టెక్–సస్టైనబుల్ ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్, సస్టైనబుల్ రిటైలింగ్, సరఫరా గొలుసు, సస్టైనబుల్ మానవ మూలధనం–న్యాయకత్వం, హెల్త్‌కేర్ సేవలు, సస్టైనబుల్ వ్యాపార నమూనాలపై ప్యానెల్ చర్చలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, విభాగ డీన్ ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, డా. రాధాకృష్ణ, డా. బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News