Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:15 AM

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

01-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిత్తశుద్ధితో పనిచేసి యూనివర్సిటీ కి మంచి పేరు తీసుకురావాలి: వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

స్థానికం ప్రతినిధి జూబ్లీహిల్స్:

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ మరియు డైరీలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఘనంగా ఆవిష్కరించారు. గురువారం యూనివర్సిటీ జరిగిన కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయా కృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

నాణ్యమైనవిద్యే లక్ష్యం: ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఉద్యోగులందరూ మరింత జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అధ్యాపక, అధ్యపకేతర సిబ్బందికి, విద్యార్థులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి సేవలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

వీసీ, రిజిస్ట్రార్లకు ఘన సన్మానం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు గాను, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణిని, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డిని ఘనంగా సన్మానించారు.

పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, హెడ్లు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కాంతం ప్రేమ్ కుమార్, ఎన్.సి. వేణుగోపాల్, విశ్వనాథ్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా మరియు ఇతర సిబ్బంది ఈ వేడుకలో భాగస్వాములయ్యారు.

Sthanikam

అంబేద్కర్‌ వర్సిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News