Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:21 PM

అమరవీరుని ఆశయాలకు వారసత్వం – సమాజ సేవలోకి అడుగుపెట్టిన కూతురు

05-02-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట:

దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన తండ్రి ఆశయాలను సమాజ సేవ ద్వారా కొనసాగించాలనే సంకల్పంతో కూతురు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన హృదయస్పర్శి ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో చోటుచేసుకుంది.కార్గిల్ యుద్ధంలో శత్రు తుపాకీ గుండుకు బలై దేశానికి అమరుడైన వీరసైనికుడు పోలోజు గోపయ్య చారి చేసిన త్యాగం నేటికీ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ అమరవీరుని ఏకైక కూతురు పోలోజు మౌనిక, తండ్రి చూపిన సేవా మార్గాన్నే అనుసరిస్తూ సమాజ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.46వ వార్డు అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి, యువత మరియు మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తోంది.దేశం కోసం తండ్రి చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, సమాజ సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 46వ వార్డు ప్రజలను మౌనిక విజ్ఞప్తి చేసింది.

Sthanikam

అమరవీరుని ఆశయాలకు వారసత్వం – సమాజ సేవలోకి అడుగుపెట్టిన కూతురు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News