Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:37 AM

అమరవీరుడు సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

అమరవీరుడు సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

అమరవీరుడు సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ
January 18, 2026 01:28 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముగ్గురు పిల్లల పేరిట రూ.15 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చెక్కులు అందజేత

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం


బీసీల ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం పోరాడుతూ ఆత్మబలిదానం చేసిన బీసీ బిడ్డ, అమరవీరుడు సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి ఇచ్చిన మాటను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబెట్టుకుంది. సాయి ఈశ్వర్ చారి ముగ్గురు పిల్లల భవిష్యత్తు భద్రత కోసం తలా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్కు సంబంధించిన చెక్కులను పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న భావోద్వేగంగా మాట్లాడుతూ,బీసీల హక్కుల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన సాయి ఈశ్వర్ చారి మరణం అత్యంత బాధాకరం. ‘మీ పిల్లల బాధ్యత మాది, వారి భవిష్యత్తుకు మేము అండగా ఉంటాం’ అని ఆనాడు ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకుంటున్నాం. ముగ్గురు పిల్లల పేరిట తలా రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేసి, ఆ పత్రాలను వారి తల్లికి అందజేశాం అని తెలిపారు.ప్రభుత్వ నిర్బంధాలను దాటుకొని అండగా నిలిచాం సాయి ఈశ్వర్ చారి అంత్యక్రియలకు వెళ్లకుండా ప్రభుత్వం తనను పోలీసులతో గృహనిర్బంధం చేసిందని, ప్రజా సమస్యలపై పోరాడే గొంతుకను నొక్కే ప్రయత్నం జరిగిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తాను వెళ్లలేకపోయినా పార్టీ నాయకులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారని, మరుసటి రోజే తాను స్వయంగా వెళ్లి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పానని తెలిపారు. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం అని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ పూర్తి అండ సాయి ఈశ్వర్ చారిని తిరిగి తీసుకురాలేము. కానీ ఆయన కన్న కలలను, కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుంది. సాయి ఈశ్వర్ చారి ఆశించిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూస్తాం” అని భరోసా ఇచ్చారు అలాగే, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

సాయి ఈశ్వర్ చారి భార్య కవిత మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం ఇంతటి భారీ ఆర్థిక సాయం చేసి తమ పిల్లల చదువులు, భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన భర్త కోరుకున్న బీసీ రాజ్యం కోసం నిరంతరం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఓదెలు యాదవ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకులు నాగరాజు గౌడ్, సాయి ఈశ్వర్ చారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News