Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:34 PM

అమ్మ–బిడ్డకు అండగా… యాదాద్రిలో 102 అమ్మఒడి సేవలు

08-12-2025 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆరు వాహనాలతో జిల్లావ్యాప్తంగా వేగవంతమైన స్పందన

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి జిల్లా:

గర్భిణీ, బాలింతల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న 102 అమ్మఒడి వాహనాలు యాదాద్రి జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గర్భం వచ్చిన మొదటి నెల నుంచే… కాన్పు అయ్యే వరకు… కాన్పు అనంతరం ఇంటి దాకా… ప్రతి దశలో అమ్మఒడి భద్రతగా నిలుస్తోంది.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆరు 102 వాహనాలు పనిచేస్తూ, ఎప్పటికప్పుడు కాల్‌ వచ్చిన వెంటనే స్పందిస్తూ గర్భిణీలను ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఆంటీ నేటల్ చెకప్‌లకు వెళ్లేవారికి, కాన్పు తరువాత ఇంటికి చేరేవారికి కూడా ఇదే ప్రధాన ఆధారం.

మాత–శిశు మరణాలు తగ్గుదలకు పురోగమనమే

ప్రతి నెల జరిగే గర్భిణీల పరీక్షలకు వారి ఇళ్లనుంచి ఆరోగ్య కేంద్రాల దాకా సురక్షితంగా తరలించడం వల్లరక్తహీనత వంటి సమస్యలు ముందుగానే గుర్తించడంశిశువు గర్భంలో కదలికలు సరిగా ఉన్నాయా తెలుసుకోవడంప్రమాద సూచనలపై వెంటనే వైద్యపర్యవేక్షణసాధ్యమవుతున్నాయని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.ఇది మాత–శిశు మరణాల రేటు తగ్గడానికి దారితీస్తోందని వారు పేర్కొన్నారు.

ఆశవర్కర్ల అవగాహనతో సేవలు మరింత చేరువ

ఆశ వర్కర్లు ప్రతి గర్భిణీ వివరాలను నమోదు చేసి, 102 వాహన సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షలు, టీకాలు, ఫాలోఅప్‌ చెక్‌ప్‌లకు తరలించడంలో అమ్మఒడి వాహనాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

అధికారుల మాటల్లో…

102 ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం

“ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలున్నాయి. గర్భిణీలు అమ్మఒడి సేవలను వినియోగించడం ద్వారా సురక్షిత ప్రసవాలు జరుగుతున్నాయి.”

102 జిల్లాఇన్‌చార్జ్ ధూపాటి మహేష్‌కుమార్

“వాహనాల అందుబాటు పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రజల్లో నమ్మకం పెరిగింది.”

102 వాహన కెప్టెన్ నాగరాజు

“సమయంలో గర్భిణీని తరలించడం మా ప్రధాన బాధ్యత. అవసరం వచ్చిన ప్రతిసారి మేము ముందుంటాం.”

102 వాహనాల సమయపాలన మెరుగుపడటంతో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు పెద్ద సాయం అవుతోంది. ప్రస్తుతం ఫిర్యాదులు తీవ్రంగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఫాలోఅప్‌ వ్యవస్థ బలపడటంతో కొత్తగా వచ్చే కేసులు కూడా ముందుగానే పర్యవేక్షణలోకి వస్తున్నాయి.

Sthanikam

అమ్మ–బిడ్డకు అండగా… యాదాద్రిలో 102 అమ్మఒడి సేవలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News