Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

26-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఫైర్ సేఫ్టీపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వప్న రాథోడ్ ఆధ్వర్యంలో వైద్యులు,సిబ్బంది,రోగులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా హాజరై అగ్ని ప్రమాదాలపై సమగ్ర అవగాహన కల్పించారు.అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు,మంటలను నియంత్రించే విధానాలు,ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం,ప్రమాద స్థలం నుండి సురక్షితంగా బయటపడే మార్గాలు,ఇతరులను ఎలా రక్షించాలి వంటి కీలక అంశాలను వివరంగా తెలియజేశారు.అలాగే ప్రాక్టికల్ డెమో ద్వారా మంటలను ఎలా ఆర్పాలో ప్రత్యక్షంగా చూపించారు.ప్రత్యేకంగా ఆసుపత్రి వంటి సున్నిత ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు,ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సిబ్బంది బాధ్యతలు,రోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కే.శ్రీనివాస్,వి.నరేష్,ఏ.మల్లేషం,ఎన్.కర్ణాకర్ చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత పెరగడంతో పాటు,అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో స్పష్టమైన అవగాహన కల్పించారు.

Sthanikam

ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News