Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

17-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్.

వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఎన్నిక.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాస్వామ్య పర్వదినాన్ని తలపించే విధంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారి ఆర్డీవో కృష్ణారెడ్డి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.మొదటగా రెండో వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, ఆరో వార్డు కౌన్సిలర్ అంగడి ఆంజనేయులు,ఏడో వార్డు కౌన్సిలర్ బీజన బాలమణి,9వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు,10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత,11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్,12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.మున్సిపల్ ప్రత్యేక ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం సజావుగా జరిగింది.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,మేనేజర్ జగన్మోహన్,సహాయ అధికారి దూడల వెంకటేష్ ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరై నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.అనంతరం చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడింది.మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి భాస్కర్,వైస్ చైర్‌పర్సన్‌గా అంగడి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల ప్రకటన అనంతరం సభలో హర్షధ్వానాలు మార్మోగాయి.పార్టీ శ్రేణులు,అభిమానులు పూలమాలలతో అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన చైర్‌ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి,పారదర్శక పాలన,ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.వైస్ చైర్‌ పర్సన్ అంగడి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.మొత్తంగా ఆలేరు మున్సిపాలిటీలో కొత్త నాయకత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

Sthanikam

ఆలేరు మున్సిపాలిటీలో ఘనంగా నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News