Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:31 PM

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు

28-03-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో ప్రారంభమయ్యే ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు జరిగే మహోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని భావించి, వారికి కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరభద్ర బోర్ వెల్స్ (నారాయణఖేడ్) కు చెందిన జుక్కల్ గ్రామానికి చెందిన వీరన్న ఆలయానికి మూడు సిమెంట్ బెంచీలను అందజేశారు. ఈ బెంచీలు గుడి వద్దకు చేరుకుని వాటికి పెయింటింగ్ కూడా చేశారు. భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లయ్య, అర్చకులు నాగయ్య స్వామి, ఆలయ సిబ్బంది శేఖర్‌తో పాటు సిద్దప్ప, మొగులప్ప, శ్రీను, నగేష్ మరియు గ్రామ ప్రజలు, భక్తులు దాత వీరన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముందుకు వచ్చి సహాయం చేసినందుకు ఆయనను అభినందించారు. మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు మరియు ఆలయ నిర్వాహకులు సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతకు అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News