Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

అల్లాపురం సర్పంచ్ ఫై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

11-02-2026 228 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ

రాచకొండ పరిధిలోని శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ దేవస్థానం వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిన అల్లాపురం గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వరకాంతం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 9న ఓ దినపత్రికలో అల్లాపురం సర్పంచ్ లెటర్హెడ్ పై శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీకి సంబంధించి నూతన కమిటీ ఏర్పాటు చేసి, చైర్మన్ తో పాటు సభ్యులను ఎన్నుకున్నట్లు ప్రచురితమైందని తెలిపారు. శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ అమ్మవారి దేవస్థానం రాచకొండ గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ల పరిధిలో ఉందని, సంబంధిత రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ దేవస్థానం అల్లాపురం గ్రామ పంచాయతీ పరిపాలనా పరిధిలోకి రాదని కమిటీ స్పష్టం చేసింది.ఈ దేవస్థానం భక్తుల విరాళాల ఆధారంగా ఏర్పాటై, గత 15 సంవత్సరాలుగా శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిరంతరంగా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. అల్లాపురం గ్రామ పంచాయతీకి ఈ దేవస్థానంపై ఎలాంటి పరిపాలనా లేదా నిర్వహణాధికారం లేదని, రాచకొండ రెవెన్యూలో ఉన్న దేవాలయానికి సంబంధించి కమిటీ ఏర్పాటు, రద్దు లేదా పునఃవ్యవస్థీకరణ చేయడానికి అల్లాపురం సర్పంచ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చట్టబద్ధ అధికారం లేదని కమిటీ సభ్యులు తెలిపారు. అధికార పరిధి లేని అంశంలో అధికారిక లెటర్హెడ్ ఉపయోగించి జోక్యం చేయడం అధికార దుర్వినియోగంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది మతపరమైన పరిపాలనలో అనవసర జోక్యానికి

దారితీస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విధమైన అనధికార చర్యల వల్ల భక్తుల్లో అయోమయం, విభేదాలు తలెత్తే ప్రమాదంతో పాటు దేవస్థానం ఆస్తులు, విరాళాలు, నిర్వహణపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే అల్లాపురం గ్రామ సర్పంచ్ కు వ్రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేసినప్పటికీ పరిస్థితి మారకపోవడంతోనే ఈ ఫిర్యాదు చేస్తున్నామని కమిటీ తెలిపింది. ఈ వ్యవహారంపై సర్పంచ్ పాలనా పరమైన తక్షణ విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం చేయకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లయితే నిబంధనల ప్రకారం తగిన శిక్షా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఎంపీడీవో సందీఫ్ కు కూడా వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ సరళ మైసమ్మ దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అర్ద వెంకట్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొలను శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షులు ముత్యాల నర్సిరెడ్డి, కొలను మాధవరెడ్డి, కోశాధికారి కొలను సరేందర్ రెడ్డి, రాసాల శ్రీకాంత్, ప్రచార కార్యదర్శి సామ సుదర్శన్ రెడ్డి, ముత్యాల సుదర్శన్ రెడ్డి, ఫకీరు శ్రీకాంత్ రెడ్డి, బొడ్డు గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అల్లాపురం సర్పంచ్ ఫై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News