Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:10 PM

ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!

16-02-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆకులో ఆవిర్భవించిన ఆధ్యాత్మికత… ధనోజ చేతివాటంతో సజీవమైన శివరూపం!

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కళ్లెం ధనోజ అనే యువ కళాకారిణి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తన అపూర్వ ప్రతిభతో శివభక్తిని చాటుకున్నారు. సాధారణంగా కాగితం, కాన్వాస్‌లపై చిత్రాలు వేయడం చూస్తుంటాం. కానీ ధనోజ మాత్రం ప్రకృతి ప్రసాదమైన రావి ఆకును కాన్వాస్‌గా ఎంచుకుని, అత్యంత సూక్ష్మంగా మహాదేవుని చిత్రపటాన్ని ఆవిష్కరించడం విశేషం.

రావి ఆకుపై శివుని రూపాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆమె తన కళాత్మక నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి సందర్భాన దేశభక్తి నాయకులు, రాజకీయ ప్రముఖుల చిత్రాలను తన చేతివాటంతో సజీవంగా తీర్చిదిద్దుతూ ఇప్పటికే ప్రశంసలు అందుకున్న ధనోజకు ఈ సృజనాత్మక కృషి మరింత గుర్తింపునిచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మహాశివరాత్రి అనేది భక్తి, నియమం, ఆత్మశుద్ధికి ప్రతీక. ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణతో శివనామస్మరణ చేస్తూ ఆ మహాశివుని ఆశీర్వాదం పొందాలి. భోళేశంకరుడి కరుణకటాక్షంతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

Sthanikam

ఆకుపై మహాదేవుని రూపం… శివభక్తిని కళగా మలిచిన ధనోజ!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News