Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు

27-12-2025 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంపూర్ణ అక్షరాస్యతే గ్రామ అభివృద్ధికి పునాది – ప్యారీ బేగం

యాదగిరిగుట్ట స్థానికం ప్రతినిధి

గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేయాలని గోల్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్యారీ బేగం పిలుపునిచ్చారు.

శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌, వార్డు సభ్యులను గోల్కొండ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లేలా చూడాలని, గ్రామాల్లో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, బాల్య వివాహాలు జరగకుండా పాలకవర్గం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లి పేరుతో చదువుకు దూరం చేయవద్దని హితవు పలికారు.

పాఠశాల కరస్పాండెంట్ షేక్ మంజుబాబ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలై మద్యం, బెట్టింగ్‌లు, అప్పుల ఊబిలో చిక్కుకుని చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నూతన పాలకవర్గం చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామ సర్పంచ్ కళ్లెం జుహంగీర్ మాట్లాడుతూ వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాశం సంగీత, చల్లూరు ఉప సర్పంచ్ బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు షేక్ షరీఫ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, నూతన వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

అక్షరాస్యతే ఆయుధం – నూతన పాలకవర్గానికి ప్యారీ బేగం పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News