Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి! AICCTU జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య!

అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి! AICCTU జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య!

అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి! AICCTU జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య!
February 04, 2026 05:51 AM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆల్ ఇండియా సెంటర్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (AICCTU అనుబంధం) ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ మిడ్డే మీల్ వర్కర్స్ యూనియన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సంయుక్తముగా నూజివీడు మండల విద్యాశాఖ అధికారి వారి కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసిసి టు యు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల యందు 2003 నుండి మిడ్డే మీల్ వర్కర్స్ గాను, 2015 సంవత్సరం నుండి శానిటేషన్ వర్కర్స్ గాను విధులు నిర్వహిస్తున్న,మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేక ఆందోళన కార్యక్రమాల ద్వారా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన, నేడుకేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు జీవనానికి అడ్డగా మారి కార్మికుల జీవనోపాధికి ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల యందు 2003 సంవత్సరంలో విద్యార్థులకు రుచి శుచికరమైన మంచి భోజనం వేడి వేడిగా వండి వడ్డించాలని సంకల్పముతో ప్రభుత్వం పాఠశాలల యందు మధ్యాహ్నం భోజన పథకం ఏజెన్సీలుగా నియమించిందని, 2015 సంవత్సరంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం దుమ్ము దూళి క్రిమి కీటకాలనుండి అనారోగ్య బారిన పడకుండా పరిశుభ్రంగా ఉండుటకు గాను శానిటేషన్ కార్మికులను నియమించడం జరిగిందని, వారికి చాలిచాలని అతి తక్కువ వేతనాలు ఇస్తూ, బిల్లులు నెలల తరబడి జాప్యం చేస్తుందని, తద్వారా మేము అప్పుల పాలగుతున్నారని, మెటీరియల్ మొత్తం ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా,మిడ్డే మీల్ కార్మికులుగా గుర్తించాలని అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగిందని, సానిటేషన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఆయాలుగా మార్చి ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉందని, ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వడం లేదని, రాజకీయ వేధింపులు కక్ష సాధింపులకు పాల్పడుతుందని, ఉద్యోగ భద్రత లేదు సామాజిక రక్షణ లేదు.మూలిగే నక్కపై తాటిపండు పడ్డ సామెతగా కేంద్ర ప్రభుత్వం, బ్రిటిష్ వారిపై పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను అతి దారుణంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు శ్రమ దోపిడీకి పాల్పడుతూ కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తూ, మహిళా కార్మికులను రాత్రి డ్యూటీల్లో విధులు నిర్వహించాలని దుర్మార్గమైన చట్టాలను తీసుకురావడం జరిగిందని, ఈ నాలుగు లేబర్ కోడ్లును రద్దు చేయాలని, కార్మికులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు 36వేల రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ది. 12.03. 2026 తేదీన అఖిలభారత సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పల్లె భవాని, స్కీం వర్కర్స్ ఫెడరేషన్ మండల కార్యదర్శి బత్తిన అరుణ కుమారి అధ్యక్షులు జూట్రూ కమల, చౌటపల్లి అరుణ, కలపాల రామలక్ష్మి, షేక్ గౌస్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News