Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

12-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్‌పేట్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూప్రాన్‌పేట్ గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య (57) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన ప్యాషన్ ప్లస్ బైక్‌ (ఏపీ 24 ఏబీ 3273)పై పనిమీద హైదరాబాద్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఉదయం సుమారు 11 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ పరిధిలోని భాస్కర్ ఆగ్రో కెమికల్ కంపెనీ ఎదుటకు రాగానే ఎదురుగా అకస్మాత్తుగా గుర్తుతెలియని బిచ్చగాడు రోడ్డుమీదికి రావడంతో జంగయ్య బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

బిచ్చగాడికి పలుచోట్ల గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు బక్కతట్ల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

అకస్మాత్తుగా అడ్డొచ్చిన బిచ్చగాడు.. బైక్‌ ప్రమాదంలో డ్రైవర్ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News