Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

17-01-2026 607 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామ శివారు పరిధిలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్‌కు అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు చాకచక్యంగా నిలిపివేశారు.ఈ చర్యతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.ఘటనను గమనించిన ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా,వట్పల్లి 108 సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జనార్ధన్‌ను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం జనార్ధన్ కన్నుమూశారుతన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వృత్తి ధర్మాన్ని చాటుకున్న జనార్ధన్‌ను గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యేలా నివాళులు అర్పించారు. ఇలాంటి బాధ్యతాయుత డ్రైవర్లు ఆర్టీసీలో ఉండటం ప్రయాణికుల అదృష్టమని కొనియాడారు.ఆకస్మిక మృతితో బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనార్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

అకస్మాత్తు హృదయపాతం, బస్సు రోడ్డు పక్కన నిలిపి 40 మంది ప్రాణాలు రక్షించిన డ్రైవర్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News