Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:05 AM

అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా: ఎస్పీ నరసింహ

12-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు. పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం తరలింపును నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 65పై టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్‌పోస్టును ఎస్పీ నరసింహ సందర్శించి వాహనాల తనిఖీలను పరిశీలించారు. చెక్‌పోస్ట్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ముఖ్య ప్రాంతాల్లో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికడుతున్నట్లు చెప్పారు.

వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం, ఇసుక, పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి రాత్రింబవళ్లు తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు సంతల్లో కొనుగోలు చేసిన పశువులను రవాణా చేసేటప్పుడు సంబంధిత అనుమతి పత్రాలు వెంట తీసుకెళ్లాలని సూచించారు.

ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, చెక్‌పోస్ట్ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా: ఎస్పీ నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News