Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు
March 25, 2026 07:09 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా పోలీసు అధికారి నరసింహతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆరు ఇసుక నిల్వ ప్రాంతాల్లో అక్రమ రవాణా వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేపట్టాలని, ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, గనుల శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ బృందం నిరంతరం ఇసుక నిల్వ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో ఆమోదం పొందిన 729 ఇసుక ట్రాక్టర్లకు గుర్తింపు కోసం రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ మరియు వాహన గుర్తింపు కెమెరాల పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఇసుక రవాణా ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ కోసం ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమతి లేని వాహనాలు గుర్తిస్తే వెంటనే నిరోధించాలని స్పష్టం చేశారు.

తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు ఇసుక నిల్వ ప్రాంతాలను సందర్శించాలని, అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుందని, గ్రామ పంచాయతీ కార్యదర్శి అవసరాన్ని నిర్ధారించి తహసీల్దార్ పర్యవేక్షణలో నమోదు చేపడతారని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, రెవెన్యూ విభాగాధికారి వేణు మాధవరావు, గనుల శాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News